బుధవారం కొమరాడ మండలంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని సంబంధిత వార్డెన్లను ఆదేశించారు. మండలంలోని పలు విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలు, రైస్ మిల్లును సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.