పార్వతీపురం మండలం కొత్తవలసలో కొత్త పోలమ్మ అమ్మవారి పండగ సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో వాహనాల రద్దీ అమాంతం పెరిగింది. ముఖ్యంగా మెయిన్ రోడ్డులోని ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. గంటల పాటు వాహనాలు కదలక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు.