పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని లలితా దేవి మరియు పంచముఖేశ్వర ఆలయంలో ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా లలితా హోమం, లలితా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. శనివారం సాయంత్రం, సుబ్బు గురువు ఆధ్వర్యంలో లలితా దేవి పారాయణం, హోమం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, హోమం అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.