నాటు సార స్థావరాలపై మెరుపు దాడులు

2చూసినవారు
నాటు సార స్థావరాలపై మెరుపు దాడులు
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని పార్వతీపురం మన్యం జిల్లాలో మొరమ గ్రామ పరిసరాల్లో  AES సంతోష్ ఆధ్వర్యంలో ఒడిశా పోలీసులతో కలిసి సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా, నాటు సారా తయారీ స్థావరాలను గుర్తించి, 16 వేల లీటర్ల బెల్లం ఊటను, రవాణాకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ దాడుల్లో పార్వతీపురం, పాలకొండ, విజయనగరం ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్