పార్వతీపురంలో నాటు సారాయిపై మెరుపు దాడులు

431చూసినవారు
పార్వతీపురంలో నాటు సారాయిపై మెరుపు దాడులు
మన్యం జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణంలోని పెదరేల్లివీది, ఇందిరాకాలనీ, బాలగుడబ గ్రామాల్లో నాటు సారాయి స్థావరాలపై మెరుపు దాడులు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. జిల్లాను నాటు సారా రహితంగా మార్చేందుకు 23 అంతర్ రాష్ట్ర దాడులు, 4 డ్రోన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. నిమ్మకాయల అమర్నాద్‌పై పీడీ యాక్ట్ అమలు చేసి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. మరిన్ని కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్