మన్యం జిల్లావ్యాప్తంగా ‘జలరక్షణ’ కార్యక్రమం

145చూసినవారు
మన్యం జిల్లావ్యాప్తంగా ‘జలరక్షణ’ కార్యక్రమం
మన్యం జిల్లాలో చెరువులు, నీటి వనరుల సంరక్షణ కోసం సోమవారం నుంచి 'జలరక్షణ' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని తహసిల్దార్లు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. చెరువుల హద్దుల గుర్తింపు, ట్రెంచ్ తవ్వకాలు, మొక్కల నాటకం వంటి పనులను వేగవంతం చేయాలని, హద్దుల సర్వే ప్రక్రియను పూర్తిచేసి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని సూచించారు. జలధార, జలహారతి కార్యక్రమాల తరహాలో జలరక్షణను కూడా విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్