మహా చండి హోమంలో పాల్గున్న మంత్రి సంధ్య రాణి

199చూసినవారు
మహా చండి హోమంలో పాల్గున్న మంత్రి సంధ్య రాణి
ఉత్తరాంధ్రలోని శంబర పోలమంబ అమ్మవారి ఆలయంలో 10వ మంగళవారం (ఆఖరి) సందర్భంగా మహా చండి హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ హోమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన హోమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్