నాగలితో పొలాన్ని దున్నిన మంత్రి సంధ్యారాణి

519చూసినవారు
రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం మక్కువ గ్రామంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆమె, నాగలితో స్వయంగా పొలాన్ని దున్ని ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం రైతులతో కలిసి విత్తనాలు వేసి సాగు పనులను ప్రారంభించి, రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్