గ్రీన్ అంబాసిడర్లకు రిక్షాలు, తొట్టెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోనెల

152చూసినవారు
గ్రీన్ అంబాసిడర్లకు రిక్షాలు, తొట్టెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోనెల
బలిజిపేట మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం మంజూరు చేసిన రిక్షాలు, తొట్టెలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రీన్ అంబాసిడర్లతో మాట్లాడుతూ గ్రామాల్లో తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు సక్రమంగా తరలించే బాధ్యతను చేపట్టాలని సూచించారు. సక్రమంగా పనిచేసిన గ్రీన్ అంబాసిడర్లకు ప్రతినెల జీతాలు అందేలా పంచాయతీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్