పార్వతీపురం మున్సిపాలిటీని అగ్రశ్రేణి కార్పొరేషన్ గా మార్చడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. 30వ వార్డులో మున్సిపాలిటీ అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలకు అతి త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. వార్డులోని ప్రధాన సమస్యలను, ముఖ్యంగా కాలువలు, రోడ్లు పరిశీలించి వాటి అభివృద్ధికి నివేదికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 1970లో ఏర్పాటు అయిన పార్వతీపురం మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అభివృద్ధి చేయడానికి సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.