రూ.3కోట్లతో ప్రభుత్వ బాలుర వసతిగృహానికి ఎమ్మెల్యే శంఖుస్థాపన

200చూసినవారు
రూ.3కోట్లతో ప్రభుత్వ బాలుర వసతిగృహానికి ఎమ్మెల్యే శంఖుస్థాపన
పార్వతీపురం పట్టణం చాకలిబెలగాంలో రూ.3కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ బాలుర వసతిగృహ సముదాయానికి ఎమ్మెల్యే విజయచంద్ర శంఖుస్థాపన చేశారు. ఈ వసతిగృహం సుమారు వంద మంది విద్యార్థులకు అన్ని వసతులతో కూడి ఉంటుందని, ఇది ఎస్సీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మంజూరైన తొమ్మిది వసతిగృహాలలో ఒకటి పార్వతీపురం మన్యం జిల్లాకు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, సోషల్ వెల్ఫేర్ మంత్రిని కోరగా, ఈ వసతిగృహం మంజూరైందని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, గత ప్రభుత్వం కల్తీ ప్రభుత్వం అని, మద్యం, దేవుని లడ్డూ కూడా కల్తీ చేసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. పార్వతీపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నానని, అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్