ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర

157చూసినవారు
ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే తన ఎజెండా అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలకు అక్కడికక్కడే మార్గనిర్దేశం చేశారు. మిగతా సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పూర్తి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్