అర్జీల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించాలి: కలెక్టర్

1391చూసినవారు
అర్జీల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించాలి: కలెక్టర్
మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులకు ప్రజల నుంచి వచ్చే అర్జీలను కేవలం విధిగా కాకుండా బాధ్యతతో పరిష్కరించాలని సూచించారు. పీజీఆర్ఎస్‌లో స్వీకరించిన 143 వినతులను సకాలంలో పరిష్కరించాలని, సమస్య పరిష్కారం తర్వాత అర్జీదారులతో మాట్లాడి సంతృప్తి తెలుసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో పిడుగుల ముప్పు ఉన్నందున మొబైల్ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్. వైశాలి, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్