నిడగల్లు నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవం

262చూసినవారు
సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. దేవాదాయశాఖ నుంచి రూ. 50 లక్షల నిధులతో పునర్నిర్మించిన ఈ పురాతన ఆలయంలో రెండు రోజులుగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎంపీపీ బలగ రవణమ్మ, జడ్పీటీసీ మామిడి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు జోగారావుకు స్వాగతం పలికారు. వేదపండితుల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్