పార్వతీపురం మన్యం జిల్లాలో 'వజ్రప్రహార్' ఆపరేషన్ లో భాగంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పార్వతీపురం రూరల్ సిఐ, బలిజిపేట ఎస్ఐ, ఎక్సైజ్ సిబ్బందితో కలిసి బాలగుడబ గ్రామంలోని రెల్లి వీధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 3 లీటర్ల నాటు సారా (30 పాకెట్లు) స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అలాగే, గ్రామంలో మాదకద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించి, స్థానిక ప్రజలకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై వివరించారు.