పార్వతీపురం: PGRSలో ఫిర్యాదు.. వెంటనే స్పందన

135చూసినవారు
పార్వతీపురం: PGRSలో ఫిర్యాదు.. వెంటనే స్పందన
బెలగాంకు చెందిన నాగజ్యోతి అనే దివ్యాంగురాలి వినతి మేరకు, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) కె.హేమలత సోమవారం స్పందించి ఆమెకు వినికిడి యంత్రాన్ని అందజేశారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో సూచించారు. తన సమస్యపై వెంటనే స్పందించి సహాయం అందించినందుకు బాధితురాలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్