పార్వతీపురం పట్టణంలోని పండా వీధిలో, రాధాకృష్ణ ఆలయం ఎదురుగా ఉన్న వీధిలైటు గత కొన్ని రోజులుగా వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో ఆ ప్రాంతం పూర్తిగా చీకటిగా మారి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు,
విద్యార్థులు రాత్రి వేళల్లో ఆ మార్గంలో వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధిలైటును మరమ్మతు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.