జిల్లాలో గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. గర్భిణుల బాధ్యత మహిళా శిశు సంక్షేమశాఖ సిబ్బందేనని తెలిపారు. వారిలో రక్తహీనత నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీలు సక్రమంగా పౌష్టికాహారం అందించి పర్యవేక్షించాలని, మాతాశిశువుల సంరక్షణే లక్ష్యం కావాలన్నారు.