పార్వతీపురం: ఈవీఎం గొదామును తనిఖీ చేసిన కలెక్టర్

539చూసినవారు
పార్వతీపురం: ఈవీఎం గొదామును తనిఖీ చేసిన కలెక్టర్
త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవిఎం గొదామును గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులతో కలిసి మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్ది శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఈవీఎం గొదాము భద్రతకు చేపడుతున్న చర్యలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈవీఎం గొదాముల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాలని, ఈవీఎంలు, వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :