స్థానిక సంస్థల ఎన్నికల విధులకు గైర్హాజరైన 65 మంది ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో గ్రామ/వార్డు సచివాలయ శాఖకు చెందిన 30 మంది, విద్యాశాఖకు చెందిన 27 మంది మరియు ఐసీడీఎస్ శాఖకు చెందిన 8 మంది ఉన్నారు. వీరందరూ మూడు రోజుల్లోగా విధులకు ఎందుకు గైర్హాజరయ్యారో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.