పార్వతీపురం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి బి.కామేశ్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పరుగు, షాట్ పుట్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. శ్రీలంకలో జరిగే ప్రపంచ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ విజయంపై ఉద్యోగులు, బంధువులు, స్నేహితులు, క్రీడాకారులు ఆయనకు అభినందనలు తెలిపారు.