నరసరావుపేట ప్రకాశ్‌నగర్‌లో శనివారం పోలీసులు నిర్వహించిన దాడిలో 1.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు బీటెక్ విద్యార్థులతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మన్యం జిల్లాకు చెందిన విద్యార్థి గంజాయి తెచ్చి ఇక్కడ మరో విద్యార్థికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.