శుక్రవారం పార్వతీపురంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బలిజిపేట, సీతానగరం మండలాలు, పార్వతీపురం పట్టణానికి చెందిన పలువురికి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆరోగ్య సమస్యలతో చికిత్స చేయించుకోలేని పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. సహాయం అందిన లబ్ధిదారులు ప్రభుత్వం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.