పార్వతీపురం మున్సిపాలిటీ సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే

48చూసినవారు
పార్వతీపురం మున్సిపాలిటీ సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే
పార్వతీపురం మున్సిపాలిటీలోని అన్ని వార్డుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శుక్రవారం 22వ వార్డులో పర్యటించిన ఆయన ప్రజలను కలుసుకుని డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, శానిటేషన్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీకి 30 వార్డుల్లో 100 అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, వాటిని ఒకేసారి ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే రూ.4 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మార్చి నెలాఖరులోపు గుర్తించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని, డంపింగ్ యార్డు తరలింపుతో పాటు చెత్త వేర్పాటు పై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్