పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం బార్ లైసెన్సుల కేటాయింపు జరిగింది. జిల్లాలో పార్వతీపురం, సాలూరు పట్టణాలకు చెందిన 4 బార్లకు గానూ 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. DRO హేమలత డ్రా ద్వారా లాటరీ తీసి దరఖాస్తుదారులకు బహిరంగంగా చూపించారు. అత్యంత పారదర్శకంగా బార్ల కేటాయింపు ప్రక్రియ జరిగిందని, పార్వతీపురం పట్టణానికి 3, సాలూరుకి ఒక బార్‌ను కేటాయించామన్నారు.