మక్కువ: చంద్రగ్రహణం సమయంలో నిలబడిన రోకలి

0చూసినవారు
మక్కువ: చంద్రగ్రహణం సమయంలో నిలబడిన రోకలి
మక్కువ మండలం మక్కువ గ్రామంలో చంద్రగ్రహణం సందర్భంగా ఒక వింత ఆచారం పాటించారు. వేంపల్లి వారి వీధిలో గ్రహణ సమయంలో ఇత్తడి గిన్నెలో పాలు, పసుపు, కుంకుమ వేసి రోకలిని నిలబెట్టారు. దీనిని గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఇత్తడి ప్లేటులో పాలు, పసుపు, కుంకుమ పోసి రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది.