ఇంటింటికీ పింఛన్లు.. లబ్ధిదారులను పలకరించిన కలెక్టర్

531చూసినవారు
పార్వతీపురం మునిసిపాలిటీ అగ్రహారం వీధిలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. వృద్ధాప్యంలో ఆధారం లేని వారికి ఈ పింఛన్లు అండగా నిలుస్తాయని, ప్రభుత్వ భరోసాతో వారికి గౌరవం పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్