పార్వతీపురం పట్టణ పోలీసులు విశాఖపట్నం పెదగంట్యాడకు చెందిన 6వ తరగతి విద్యార్థిని బంగారు వైష్ణవిని సురక్షితంగా గుర్తించి ఆమె బంధువులకు అప్పగించారు. తాతగారి గ్రామానికి వెళ్లేందుకు బస్సులో ప్రయాణించి పార్వతీపురం బస్టాండ్‌లో దిగిన బాలిక, మార్గం తెలియక ఒంటరిగా తిరుగుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను సంరక్షణలోకి తీసుకుని, వివరాలు సేకరించి ఆమె అన్నయ్య కాళిదాసు, మేనత్త రోజాకు అప్పగించారు. సీఐ వెంకటరావు బాలికకు ఆర్థిక సహాయం అందించారు.