పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలని, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామని తెలిపారు. అర్జీదారులు మీకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100 నంబర్‌కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.