అడ్డాపుశీల సచివాలయంలో పల్స్ పోలియో టీకా కార్యక్రమం

675చూసినవారు
అడ్డాపుశీల సచివాలయంలో పల్స్ పోలియో టీకా కార్యక్రమం
పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామ సచివాలయంలో ఆదివారం పల్స్ పోలియో టీకా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొని ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. పోలియో నిర్మూలనలో ఈ కార్యక్రమం కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించి సహకరించాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్