పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. పార్వతీపురం నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు హాజరై పెన్షన్లు, రోడ్లు, కాలువలు, గృహాలు, ఉద్యోగాలు, రుణాలు, వీధిలైట్లు, పైపు లైన్లు వంటి సమస్యలపై వినతులు అందించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర కొన్ని వినతులను పరిశీలించి, తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు.