అధికారులు బాగోతలు బయట పడతాయని చర్యలు లేవా??

140చూసినవారు
అధికారులు బాగోతలు బయట పడతాయని చర్యలు లేవా??
పార్వతీపురం మండలం చిన్నబొండపల్లి రెవెన్యూలో సర్వే నెం 97-3, 0.25 సెంట్ల అసెండ్లాండ్ ను 1970లో ప్రభుత్వం సంచాన సోమయ్యకు కేటాయించింది. ఇదే గ్రామానికి చెందిన పిట్ట సన్యాసి ఆ భూమిని ఆక్రమించి, 2021లో రెవెన్యూ అధికారుల సహాయంతో నకిలీ పొజిషన్ సర్టిఫికెట్ పొంది ఇళ్లు నిర్మిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బాధితులు పలుమార్లు తహసీల్దార్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ లొసుగులు బయటపడతాయనే భయంతోనే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, లేదా వారికి అధికారుల అండదండలు ఉన్నాయా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్