కాలువ పూడికలతో రామాపురం కాలనీలో రోడ్లు జలమయం: అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

51చూసినవారు
కాలువ పూడికలతో రామాపురం కాలనీలో రోడ్లు జలమయం: అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపాలిటీ 29వ వార్డు రామాపురం కాలనీ ముందున్న రహదారి గత రెండేళ్లుగా కాలువల పూడికలు తీయకపోవడంతో వర్షం కురిసినప్పుడల్లా జలమయమవుతోంది. దీనివల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యేలకు, గ్రీవెన్స్ కార్యక్రమంలో పలుమార్లు వినతులు అందించినా అధికారులు చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కాలువల పూడికలు తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you