రేపటి నుంచి సదరం స్లాట్ బుకింగ్

1చూసినవారు
రేపటి నుంచి సదరం స్లాట్ బుకింగ్
దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పార్వతీపురం మన్యం జిల్లా జోన్-1 పరిధిలో ఉండగా, ఈ జోన్‌లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. వలస వచ్చిన అభ్యర్థులు తమకు కేటాయించిన జోన్‌లోనే సదరం సేవలు పొందాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు. అర్హులైన దివ్యాంగులు నిర్ణీత గడువులో స్లాట్ బుక్ చేసుకుని సదరం సేవలను వినియోగించుకోగలరు.