సాలూరులోని బాలాత్రిపుర సుందరి, పంచముఖేశ్వరస్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి జరిగే లలిత హోమం బుధవారం సాయంత్రం సుబ్బ గురువుగారి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, హోమం అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సంఘటన పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరులో చోటుచేసుకుంది.