పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సబ్ కోర్టు మంజూరు కలగా మిగిలింది. ఇటీవల న్యాయ, శాసన వ్యవహారాల శాఖ సెక్రటరీ ప్రతిభా దేవి, జి. ఓ. ఎమ్. ఎస్. నెం. 65/6--4-2026 గా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టులు మంజూరు చేయగా, సాలూరులో అదనపు సబ్ కోర్టు అవసరమని న్యాయవాదులు, కక్షిదారులు కోరుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం అప్పటి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తాడ్డి తిరుపతిరావు ప్రయత్నంతో 3 అదనపు కోర్టులు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం పెండింగ్ కేసులు అధికంగా ఉన్నందున సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.