పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర వడగాల్పులు

200చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర వడగాల్పులు
పార్వతీపురం మన్యం జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి సూచించారు. జిల్లాలోని 15 మండలాలు డేంజర్ కేటగిరీలో ఉన్నాయని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు రావద్దని, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకొని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచనలు జారీ చేశారు.