మహిళలు, బాలికల భద్రతకు జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, లైంగిక నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన శుక్రవారం హెచ్చరించారు. కురుపాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.