లడ్డూ వివాదంపై సిట్ స్పష్టత: వైయస్సార్సీపి నిరసనలో ఉద్రిక్తత

195చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ స్పష్టత ఇచ్చిందని పేర్కొంటూ వైయస్సార్సీపి ఆధ్వర్యంలో పార్వతీపురంలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నాయకత్వంలో జరిగిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతియుత ర్యాలీ అని జోగారావు పేర్కొంటూ పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం బెలగాం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్