సీతానగరం మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయం కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు పీసపాటి శ్రీనివాసాచార్య మాట్లాడుతూ, కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేయడం విశిష్టమని భక్తులకు తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.