మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో గురువారం భీష్మ ఏకాదశి పర్వదినాన షిరిడీ సాయి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. కొత్తవలస సర్పంచ్ రెడ్డి అనిత, రాష్ట్ర ఎంఎస్‌ఎస్ నాయకులు రెడ్డి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో పాలాభిషేకం కార్యక్రమాలు జరిగాయి. గ్రామానికి చెందిన పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.