అన్నమయ్య జిల్లా కె.వి పల్లి మండలం వడ్డి పల్లిలో యువ న్యాయవాది ఎల్లయ్యను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇటీవల దారి దోపిడి ముఠాను పోలీసులకు పట్టించారనే కక్షతో ఈ హత్య జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎల్లయ్య తల్లిదండ్రులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరించగా, సాలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదులు కూడా గురువారం తమ విధులను బహిష్కరించారు. ఈ సంఘటన పార్వతీపురం మన్యం, పార్వతీపురం, సాలూరు ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది.