చెల్లంనాయుడు వలసలో విదేశీ పక్షుల సందడి ప్రారంభం

0చూసినవారు
చెల్లంనాయుడు వలసలో విదేశీ పక్షుల సందడి ప్రారంభం
సీతానగరం మండలం చెల్లంనాయుడు వలసలో వేల కిలోమీటర్ల దూరం నుంచి 'ఆసియా ఓపెన్‌బిల్ కొంగలు' రాకతో విదేశీ పక్షుల సందడి మొదలైంది. ప్రతీ ఏటా జూన్ నెలలో వచ్చే ఈ పక్షులు కొన్ని నెలలు ఇక్కడ ఉండి, సంతానోత్పత్తి తర్వాత తిరిగి వెళ్లిపోతాయి. పుష్కలంగా ఆహారం, గూళ్లు కట్టేందుకు అనువైన ప్రదేశం ఉండటమే ఇందుకు కారణం. ఈ అరుదైన పక్షుల రాకతో వర్షాకాలం ప్రారంభమవుతుందని స్థానికులు విశ్వసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్