ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనం

379చూసినవారు
ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనం
పార్వతీపురం పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి, గర్భాలయ తలుపులు తెరవడంలో విఫలమై, బయట ఉన్న సుమారు 10 కిలోల కంచు గంటను అపహరించి పారిపోయాడు. సీసీ కెమెరాల్లో ఎరుపు చొక్కా, నలుపు షార్ట్ ధరించిన దొంగ కదలికలు నమోదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్