పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు, మంగళవారం పార్వతీపురం ఆర్టీసీ కూడలి వద్ద ట్రాఫిక్ ఎస్సై పాపారావు ఆధ్వర్యంలో సిబ్బంది వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపడం, అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్ల వల్ల జరిగే అనర్థాలపై వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి పత్రాలు తప్పనిసరి అని సూచించారు.