పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాలు, రైతు సేవా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 30 ఎరువుల డీలర్ పాయింట్లు, 30 రైతు సేవా కేంద్రాలను పరిశీలించి స్టాక్, రిజిస్టర్లు, బిల్లులు, లైసెన్సులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన పుట్టూరులోని వాసవి స్టోర్స్, మామిడిపల్లిలోని సూర్య గాయత్రి ఏజెన్సీస్ అమ్మకాలను నిలిపివేసి నోటీసులు జారీ చేశారు. ఎరువుల అక్రమాలు, అధిక ధరల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ హెచ్చరించింది.