యూరియా అక్రమ రవాణా

150చూసినవారు
యూరియా అక్రమ రవాణా
ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన యూరియాను AP AIMS యాప్ ద్వారా మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, శనివారం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని చెట్టపులివలస, కంబర సచివాలయాలకు చేరాల్సిన యూరియా లారీని దారిలోనే ఆపి, 20 బస్తాలను ఆటోలో అక్రమంగా తరలించినట్లు సమాచారం. ఈ అక్రమాలపై ఏవో సౌజన్య దృష్టికి తీసుకెళ్లగా, అక్రమంగా యూరియా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్