వీరఘట్టం: అగ్ని ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతి

7చూసినవారు
వీరఘట్టం: అగ్ని ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతి
వీరఘట్టం మండలం నడుకూరు గ్రామానికి చెందిన 75 ఏళ్ల సాధు నారాయణమ్మ అగ్ని ప్రమాదంలో శనివారం మృతి చెందారు. శుక్రవారం ఇంట్లో చలిమంట కోసం కుంపటి పెట్టుకోగా, ఆమె చీరకు నిప్పు అంటుకుని శరీరం మొత్తం కాలిపోయింది. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్