వీరఘట్టం: స్కూలు బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్

1చూసినవారు
వీరఘట్టంలోని తెలగ వీధి జంక్షన్ వద్ద స్కూలు బ్యానరు కడుతున్న వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలింది. 11KV విద్యుత్ లైన్ పక్కనే నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌కు ఫ్లెక్సీ కట్టేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ శంకరరావు సకాలంలో స్పందించి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.