వీరఘట్టం: CO2 ఆకృతిలో విద్యార్థుల ప్రదర్శన

3చూసినవారు
వీరఘట్టం: CO2 ఆకృతిలో విద్యార్థుల ప్రదర్శన
వీరఘట్టం మండలం పాలమెట్టలో ఇవాళ కార్బన్ డయాక్సైడ్ వ్యర్థాలను తగ్గించే రోజు సందర్భంగా యం.పి.యు.పి. స్కూల్ విద్యార్థులు CO2 ఆకృతి ప్రదర్శనతో అబ్బురపరిచారు. ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు, గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారు.